అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి-ఫైర్ అండ్ ఫర్గెట్ క్షిపణి పరీక్ష విజయవంతం-రక్షణ శాఖ

అమరావతి: 5.500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని రాత్రిపూట ప్రయోగాత్మకంగా భారత్ విజయవంతంగా నిర్వహించిందని గురువారం రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద చైనా సైనికులు భారత సైనికులతో ఘర్షణకు దిగిన కొద్ది రోజుల తర్వాత ఈ పరీక్షలు జరిగాయి. రెండు వైపుల నుంచి అనేక మంది సైనికులు గాయపడ్డారే కానీ సైన్యంలో ఎవరూ మరణించలేదు. అగ్ని- 5 అనేది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) కింద అభివృద్ధి చేయబడింది..అధునాతన మిస్సైల్ ఉపరితలం నుంచి ఉపరితల బాలిస్టిక్ క్షిపణి. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ క్షిపణి, దిన్ని ఇంటర్‌సెప్టర్ మిస్సైల్ లేకుండా ఆపలేము.ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్, ICBM, అగ్ని-5ని DRDO దేశీయంగా అభివృద్ధి చేసింది. భారతదేశం కూడా అగ్ని-6పై పని చేస్తోంది, ఇది జలాంతర్గాముల నుంచి,భూమి నుండి ప్రయోగించగలదు. 8,000–10,000 కి.మీ.ల స్ట్రైక్-రేంజ్ కలిగి ఉంటుంది.