దళారులను నమ్మవద్దు..
తిరుపతి: తమిళనాడు వెల్లూరు జిల్లా కేంద్రం క్రీడా ప్రాంగణంలో ఈనెల 15 నుంచి 29 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రిక్రూటింగ్ ఆఫీస్ (HQs), చెన్నై కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థుల కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహణ వుంటుందని, అభ్యర్థులు, “అగ్నివీర్ (పురుషులు), అగ్నివీర్ (మహిళా మిలిటరీ పోలీస్), సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/ నర్సింగ్ అసిస్టెంట్ (వెటర్నరీ) నుంచి సైన్యంలోకి జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు www.joinindianarmy.nic.in వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవాలని కోరారు.ర్యాలీకి హాజరయ్యే సమయంలో ఖచ్చితమైన ద్రువపత్రాలతో హాజరు కావాల్సి వుంటుందని, దళారులను నమ్మరాదని, ఎంపిక అర్హత మేరకు పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు.