అమరావతి: టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ కీలక ప్రకటన చేసింది..ఇక నుంచి ఎయిర్ ఇండియా పేరు,, గా మారనున్నదని సంస్థ ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ ప్రకటించారు..కంపెనీ తన దీర్ఘకాలిక లక్ష్యాలు, ప్రణాళికలను కూడా ప్రకటిస్తూ,,భారతీయ మూలాలతో ప్రపంచ స్థాయి గ్లోబల్ ఎయిర్‌లైన్‌గా మరోసారి సత్తా చాటేందుకు సమగ్రమైన ట్రాన్స్ ఫర్మేషన్ ప్రణాళికను ఆవిష్కరించారు..కొత్త ప్రణాళికలలో భాగంగా ఎయిర్ ఇండియా తన నెట్‌వర్క్, ఫ్లీట్ రెండింటినీ మరింత వృద్ధి చేయనున్నది..అలాగే వినియోగదారుల భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం,,సంస్థ విశ్వసనీయత, సమయ పాలన, పని తీరును మెరుగుపరచడం, సాంకేతికత, స్థిరత్వం, కొత్త ఆవిష్కరణలు, పెట్టుబడులపై దృష్టి వంటి కీలక అంశాలన్నింటికీ కంపెనీ అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది..కొత్త ఉద్దేశంతో అద్భుతమైన ఉత్సాహంతో కొత్త ఎయిర్ ఇండియా కోసం మేము పునాది వేస్తున్నామని విల్సన్ తెలిపారు. ఒకప్పటిలా మళ్లీ ప్రపంచ పటంలో ఎయిర్ ఇండియాకు అదే స్థానాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు.