అమరావతి: మహారాష్ట్రలోని రాయఘడ్ జిల్లా హరిహరేశ్వర్ సముద్ర తీర ప్రాంతంలో గురువారం అనుమానాస్పద స్పీడ్ బోట్ ఒకటి తీవ్ర కలకలం సృష్టించింది.. సముంద్రంలో చాలా సేపటి నుంచి ఆ బోట్ తేలుతూ కనిపించడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు..సమాచారం అందుకున్న వెంటనే జిల్లా పోలీసులు సముద్రం వద్దకు చేరుకున్న పోలీసులకు,,స్పీడ్ బోట్‌లో భారీ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. బోట్ లో AK-47 ఆసాల్ట్ రైఫిల్స్ తో పాటు క్యాట్రిడ్జిలు,ఇతర ఆయుధాలు లభ్యమయ్యాయి..ఈ సంఘటనతో రాయగడ్‌లో హైఅలెర్ట్ ప్రకటించారు..ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు,,ఈ స్పీడ్ బోట్ పై UKలో రిజిస్టర్ అయినట్లు కన్పిస్తుంది..ఇది యోమన్ నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..ఇందులో వ్యక్తులు ఎవ్వరు పట్టుబడలేదు..ఈ స్పీడ్ బోట్ ఎవరికి సంబంధించింది ? ఎలా వచ్చింది? ఆయుధాలు ఎవరి కోసం తరలించారన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..