NATIONAL

మహిళలందరికీ అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉంది-సుప్రీంకోర్టు

అమరావతి: మహిళలందరికీ అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఒక మహిళ యొక్క వైవాహిక స్థితి,అవాంఛిత గర్భాన్ని తొలగించే హక్కును తొలగించడం సాధ్యం కాదని సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (the Medical Termination of Pregnancy Act,1971) నిబంధలన ప్రకారం,,ఒంటరి, అవివాహిత స్త్రీలకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలో బెంచ్ తీర్పునిచ్చింది.24 వారాల వరకూ MTP చట్టం ప్రకారం అబార్షన్‌కు అనుమతి ఉందని,,వైవాహిక అత్యాచారానికి గురైన మహిళ కూడా అబార్షన్ హక్కును కలిగి ఉంటుందని తెలిపింది.ఈ సందర్భంగా ‘వైవాహిక అత్యాచారాన్ని’ కూడా కోర్టు ప్రస్తావించింది. వివాహితతో భర్త బలవంతంగా శృంగారం చేస్తే, గర్భం వచ్చినా దాన్ని మారిటల్ రేప్‌గా పరిగణించి, అబార్షన్ చేయించుకోవచ్చునని చెప్పింది. బలవంతపు గర్భధారణ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *