న్యూయార్క్ లో కూడా తగ్గేదే లే అంటున్న అల్లు ఆర్జున్

హైదరాబాద్: పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని భారతీయ ప్రవాసులు న్యూయార్క్ నిర్వహించిన ప్రపంచంలోనే అత్యంత ఇండియా డే పరేడ్‌కు అల్లు అర్జున్ నాయకత్వం వహించారు.తన సతీమణి స్నేహతో కలిసి జాతీయ జెండా చేతపట్టుకుని ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్నారు. అనంతరం న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇండియా డే పరేడ్ లో గ్రాండ్ మార్షల్‌గా సత్కరించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు ఐకాన్ స్టార్.న్యూయార్క్ మేయర్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అతను చాలా స్పోర్టివ్ జెంటిల్మెన్.మిస్టర్ ఎరిక్ ఆడమ్స్ ధన్యవాదాలు. తగ్గేదే లే అంటూ మేయర్‌తో కలిసి పుష్పరాజ్ సిగ్వేచర్ స్టెప్ వేశారు. వీరిద్దరు కలిసి తగ్గేదే లే అంటున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.ఈ సంవత్సర ఆగస్ట్ 15తో భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంను పురస్కరించుకుని, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌లకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ కలిసి 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
https://www.instagram.com/p/ChjBETrMEF5/?utm_source=ig_web_button_share_sheet