రూ.1.350 కోట్లుతో దుబాయ్ లో భవంతిని కొనుగొలు చేసిన అంబానీ!

అమరావతి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో అత్యంత విలాసవంతమైన భవనంను రూ.1.350 కోట్లు పెట్టి కొన్నట్లు బుధవారం జాతీయ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. విలాసవంతమైన సామ్రాజ్యం దుబాయ్‌లోని పామ్ జుమెయిరా దీవిలో ఉంది..కువైటీ వ్యాపారవేత్త మహమ్మద్ అల్‌షయా నుంచి ముకేష్ అంబానీ ఈ భవంతిని గత వారం కొనుగొలు చేసినట్లు తెలుస్తుంది. ముకేశ్ అంబానీ దుబాయ్‌లో ఓ భవంతిని కొనుగొలు చేశాడంటే అక్కడ ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకే అని చెప్పవచ్చు. గత సంవత్సరం సుప్రసిద్ధ ఇంగ్లాండ్ లోని కంట్రీ క్లబ్ స్టోక్ పార్క్ ను 79 మిలియన్ డాలర్లతో రియలన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. యూఏఈ జనాభాలో 80 శాతం మంది విదేశీయులే. దుబాయ్ లో ఆస్తులు కొనుగొలు చేయడంతో అగ్రస్థానంలో భారతీయులే వుంటారు.