AMARAVATHINATIONAL

త‌మిళ‌నాడు అసెంబ్లీలో అనూహ్య సంఘటన-సభను వాకౌట్ చేసిన గవర్నర్

అమరావతి: ఏ రాష్ట్ర అసెంబ్లీలో అధికార పక్షం విధానలకు నిరసనలు తెలుపుతూ,ప్రతిపక్షలు సభ నుంచి వాకౌట్ చేస్తుండడం చూస్తుంటాము,,ఇందుకు విరుద్దంగా త‌మిళ‌నాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ N.R ర‌వి వాకౌట్ చేశారు..గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం చేస్తున్న స‌మ‌యంలో డీఎంకే స‌భ్య‌లు ఇవాళ స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టిస్తూ,,నినాదాలతో ప్ర‌సంగాన్ని అడ్డుకున్నారు..ఈ నేప‌థ్యంలో సీఎం స్టాలిన్ జోక్యం చేసుకున్నారు..రాష్ట్ర ప్ర‌భుత్వం రాసి ఇచ్చిన ప్ర‌సంగాన్ని మాత్రమే రికార్డులోకి తీసుకోవాల‌ని,,గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో కొత్త‌గా జోడించిన అంశాల‌ను తీసివేయాల‌ని సీఎం స్టాలిన్ స్పీక‌ర్‌ను ఆదేశించారు..రాష్ట్ర ప్ర‌భుత్వం రాసి ఇచ్చిన ప్ర‌సంగాన్ని మాత్ర‌మే గ‌వ‌ర్న‌ర్ ఒరిజిన‌ల్ స్పీచ్‌గా రికార్డు చేయాల‌ని అసెంబ్లీలో తీర్మానం చేశారు..

ఇటీవ‌ల త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌,,గ‌వ‌ర్న‌ర్ ర‌వి మ‌ధ్య భిన్నాభిప్రాలు వ్యక్తం అవుతున్నాయి..అసెంబ్లీ ప్ర‌సంగంలో గ‌వ‌ర్న‌ర్ రవి,,ద్ర‌విడ నేత‌ల గురించి ప్ర‌స్తావించ‌లేదు..అంబేద్క‌ర్‌,,ద్ర‌విడ మోడ‌ల్‌కు చెందిన విష‌యాల‌ను ఆయ‌న చ‌ద‌వ‌లేదు..ప్ర‌సంగంలో ఉన్న 65వ పేరాలో ద్ర‌విడార్ ఖ‌జ‌గం వ్య‌వ‌స్థాప‌కుడు పెరియార్‌,, రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్‌,, మాజీ సీఎం కామ‌రాజ్‌,,అన్నాదురైల గురించి ఉన్న వ్యాఖ్య‌ల‌ను గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగం స‌మ‌యంలో తప్పించి వేశారు..

గత వారం గవర్నర్ ఒక సందర్బంలో మాట్లాడుతూ గవర్నర్ గత వారం మాట్లాడుతూ, దేశం మొత్తానికి వర్తించేదానిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్నారు..రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రతి పనినీ చెడు అలవాటుతో తిరస్కరించే తిరోగమన రాజకీయాలు రాష్ట్రంలో ఉన్నాయని ఆరోపించారు..తమిళనాడు పేరును మార్చాలన్నారు.. రాష్ట్రానికి తమిళనాడు కన్నా తమిళగం అనే పేరు సరైందని అన్నారు..తమిళంలో ‘నాడు’ అంటే దేశమని చెప్పారు.. ద్రావిడులమని చెప్పుకుంటూ తమిళనాడులో తిరోగమన రాజకీయాలు చేస్తున్నారన్నారు..ఈ వ్యాఖ్యలను డీఎంకే తదితర పార్టీలు తీవ్రంగా ఖండించాయి..అయితే బీజేపీ మాత్రం గవర్నర్ వ్యాఖ్యలను సమర్థించింది..తమిళనాడు గడ్డను తమిళ సాహిత్యంలో తమిళగం అని,,తమిళనాడు అని పేర్కొన్నారని తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *