ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ,1st ఇయర్, 2nd ఇయర్ ఇంటర్మీడియట్ ఫలితాలను అధికారులు మంగళవారం విడుదల చేశారు.ఆగస్టు 3వ తేది నుంచి 12వ తేది వరకు నిర్వహించారు.1st ఇయర్ జనరల్ విభాగంలో మొత్తం 68 శాతం మంది, 2nd జనరల్ విభాగంలో 73 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక వొకేషనల్ విషయానికొస్తే 1st ఇయర్‌లో మొత్తం 66 శాతం మంది, 2nd ఇయర్‌లో 80 శాతం మంది పాస్ అయ్యారు.ఈ సంవత్సరం ఇంటర్‌లో మొత్తం 70.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు..రాష్ట్ర వ్యాప్తంగా 1022 సెంటర్లలో నిర్వహించిన ఈ పరీక్షల్లో,,429 మాల్‌ప్రాక్టిస్ కేసులను నమోదు చేశారు. https://bie.ap.gov.in/ పూర్తి వివరాలు వెబ్ సైట్ లో చూసుకొవచ్చు.