ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సహజసిద్దమైన పర్యాటక ప్రాంతాలు-ద్రౌపది ముర్ము

వైసీపీ సంపూర్ణ మద్దతు..సీ.ఎం
అమరావతి: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము,,ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రంకు విచ్చేశారు..అనంతరం అమె మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో వైసీపీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలుగులో ప్రసంగం ప్రారంభించి,,మాట్లాడుతూ, వారసత్వ కట్టడాలకు ఆంధ్రప్రదేశ్ ఎన్నో వున్నాయన్నారు..ఈ గడ్డపై ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారు..తెలుగు కవులైన నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడలను ముర్ము స్మరించుకున్నారు..తిరుపతి, లేపాక్షి వంటి ప్రసిద్ధ క్షేత్రాలకు వెలసి వున్నాయన్నారు.. స్వాతంత్ర్య పోరాటంలో రాష్ట్ర నుంచి మహనీయులు ఎందరో కీలక ప్రాత పోషించారని పేర్కొన్నారు.. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంతో కీలక పాత్ర పోషించారు..రాష్ట్రంలో ప్రకృతి సహజసిద్దమైన పర్యాటక ప్రాంతాలు,, సూదీర్ఘంగామైన సముద్ర తీరం ఉన్నాయన్నారు..అనంతరం రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కోరారు..ముర్ముకే సంపూర్ణ మద్దతు:- ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు..రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించిందని,,ద్రౌపది ముర్మును గెలుపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు..