‘‘అప్పులతో ‘ఆంధ్ర’ ‘అప్పురత్న’-పవన్ కళ్యాణ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు పెరిగిపోతున్న అప్పులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్,, మంగళవారం ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై విమర్శలు చేశారు..ఒక కార్టూన్‌తో కూడిన ట్వీట్ చేస్తూ ‘‘అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. కీప్ ఇట్ అప్? మీ సంపదను పెంచుకోవడం మాత్రం మర్చిపోకండి..రాష్ట్ర అభివృద్ధి, సంపదను కుక్కలపాలు చేయండి..మీ సంపద, ఆస్తుల్ని మాత్రం పెంచుకోండి..అదే ముఖ్యమంత్రి స్ఫూర్తి’’ అని పవన్ ట్వీట్ చేశారు..దీనికి ఒక కార్టూన్ కూడా జత చేశారు..అందులో సీఎంకు ‘అప్పురత్న’ అవార్డు ఇస్తున్నట్లుగా ఉంది..ఈ కార్టూన్‌లోనే తొమ్మిది నెలల్లో ఏపీ రూ.55,555 కోట్లు అప్పు చేసినట్లు పేర్కొన్నారు…ఇది వైసీపీ ప్రభుత్వం రికార్డుగా పవన్ అభివర్ణించారు..తాజా నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఏపీ అప్పు రూ.55 వేల కోట్లు దాటింది..అంటే సగటున రోజుకు రూ.205 కోట్ల చొప్పున ఏపీ అప్పు చేస్తోంది..నెలకు రూ.6,172 కోట్లను అప్పుగా తీసుకుంటోంది..దీంతో ఏపీ అప్పుల భారం పెరిగిపోతోంది.