x
Close
NATIONAL

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా అనిల్ చౌహాన్‌ నియమకం

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా అనిల్ చౌహాన్‌ నియమకం
  • PublishedSeptember 28, 2022

అమరావతి: రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా కేంద్రం నియమించింది. బిపిన్ రావత్ ఆకాల మరణం తరువాత సైనిక అత్యున్నత పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కేంద్రం సుదీర్ఘంగా పరిశీలిన అనంతరం చౌహాన్‌ను ఎంపిక చేసింది. దాదాపు 40 సంవత్సరాలు వివిధ హోదాల్లో ఇండియన్ ఆర్మీలో చౌహాన్ పనిచేశారు. ముఖ్యంగా జమ్మూ & కాశ్మీర్, ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో విస్తృతమైన అనుభవం కలిగి ఉన్నాడని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్‌లో విధుల్లో చేరారు. అనిల్ చౌహాన్‌ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్వాస్లా, ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్ పూర్వ విద్యార్థి. మేజ్ జనరల్ హోదాలో అధికారి నార్తర్న్ కమాండ్‌లోని క్లిష్టమైన బారాముల సెక్టార్‌లో పదాతిదళ విభాగానికి నాయకత్వం వహించారు. తరువాత లెఫ్టినెంట్ జనరల్‌గా నార్త్ ఈస్ట్‌లో ఒక కార్ప్స్‌కి నాయకత్వం వహించాడు. సెప్టెంబర్ 2019 నుంచి తూర్పు కమాండ్‌కి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అయ్యాడు. మే 2021లో సర్వీస్ నుండి పదవీ విరమణ చేసే వరకు బాధ్యతలు నిర్వహించారు.2021 మే 31న ఈస్టర్న్ కమాండ్ చీఫ్ గా పదవీ విమరణ చేశారు. ఆర్మీ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా అనిల్ చౌహాన్ జాతీయ భద్రత, వ్యూహాత్మక విషయాలలో తన సహకారం అందించారు. సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) సేవలకు, పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేన పతకం, విశిష్ట సేవా పతకం పొందారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.