విరువూరు..
నెల్లూరు: అనుమానం పెనుభూతంగా మారితే పర్యావసనలు దారుణంగా వుంటాయి అనేందుకు ఎన్నో ఘటనలు ఉదహరణలు…ఈ నేపధ్యంలో నెల్లూరుజిల్లా,పొదలకూరు మండలం,విరువూరు గ్రామంలో చోటు చేసుకుంది..సి.ఐ తెలిపిన వివరాల ప్రకారం…విరువూరుకు చెందిన లక్ష్మితో,జలదంకీ మండలం,దాసరికండ్రిగవాసి కొట్టే.వెంకటేశ్వర్లుకు 20 సంవత్సరాల క్రిందట వివాహం జరిగింది.అప్పటి నుంచి విరువూరులోనే వుంటున్న వెంకటేశ్వర్లు,లక్ష్మిలకు మూగురు పిల్లలు..లక్ష్మి గ్రామంలోని మండల ప్రజాపరిక్ష త్ పాఠశాలలో పిల్లలకు భోజనం వడ్డించే అయాగా పనిచేస్తుంది.గత రెండు సంవత్సరాల నుంచి,వెంకటేశ్వర్లుకు,భార్య,వివాహేతర సంబంధం వుందన్న అనుమానం మొదలైంది.దింతో అమెను వేధించసాగాడు.రెండు నెలల క్రిందట భార్యను చంపేందుకు ప్రయత్నించగా అమె తప్పించుకుంది. భార్యపై ప్రవర్తనపై రోజు రోజుకు కసి పెంచుకున్న వెంకటేశ్వర్లు,శుక్రవారం అమె పాఠశాలకు పిలల్లకు అన్నం పెట్టేందుకు వెళ్లిన సమయం చూసుకుని,అమెను వెంబడించాడు.పాఠశాలలో వున్న అమెపై దాడి చేసి,తనతో తెచ్చుకున్న కత్తితో మెడపై బలంగా నరికి,అక్కడి నుంచి పరిపోయాడు.పాఠశాలలోని వారు తేరుకుని,లక్ష్మిని పొదలకూరు ఆసుపత్రికి తరలించే లోగా,మార్గం మధ్యలో అమె మరణించిందని పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసుకుని,దర్యాప్తు చేస్తున్నామన్నారు.