అమరావతి: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ 428 పేజీలతో కూడిన 2వ ఛార్జ్‌షీట్ ను విడుదల చేసింది.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, TRS ఎమ్మెల్సీ కవిత,YSRCP ఎంపీ మాగుంట.శ్రీనివాసులరెడ్డి పేర్లున్నాయి..సమీర్ మహేంద్రు ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కేజ్రీవాల్ పేరు వెల్లడించినట్లు పేర్కొంది..ఎక్సైజ్ పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్‌తో మాట్లాడినట్లు ఈడీ చార్జిషీట్‌లో ప్రస్తావించింది..ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మొత్తం నడిపించింది విజయ్ నాయర్ అంటూ చార్జిషీట్‌లో ప్రస్తావించారు. అంతేకాకుండా విజయ్ నాయర్.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్యాంప్ ఆఫీస్‌లోనే లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన తతంగం అంతా నడిచినట్లు ఈడీ పేర్కొంది..ఈడీ చార్జిషీట్‌లో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు..ఇప్పటికే ఒక సారి కవితను ఈడీ విచారించింది..అలాగే ఆధారాలను ధ్వసం చేసిన వారిలో కూడా కవిత పేరును ప్రస్తావించారు..ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నట్లుగా ఛార్జిషీట్‌లో ఈడీ అధికారులు తెలిపారు..మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది..ఢిల్లీ మద్యం స్కామ్ డబ్బులను గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది..
ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తు,ఈడీ చాలా చార్జీషీట్లు దాఖలు చేస్తుందని,,రాజకీయ ప్రయోజనల కోసమే ఇదంత జరుగుతుందన్నారు..దేశ వ్యాప్తంగా వివిధ కేసుల్లో ఈడీ దాదాపు 5 వేల చార్జీ షీట్లు దాఖలు చేసిందన్నారు..