టీడీపీ మాజీ మంత్రి నారాయణను విచారిస్తున్న ఏపీ సీఐడీ పోలీసులు

హైదరాబాదవ్: నగరంలోని మాజీ మంత్రి నారాయణ నివాసానికి 11.30 గంటలకు ఏపీ సీఐడీ పోలీసులు శుక్రవారం చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో నారాయణను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవతవకలపై సీఐడీ అయన స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తోంది. 160 సీఆర్పీసీ కింద నారాయణకు ఇప్పటికే నోటీసు ఇచ్చారు.నారాయణ అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల శస్త్రచికిత్స పూర్తవడంతో సీఐడీ విచారణకు హాజరుకాలేమని నారాయణ తరుపు న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు.దీంతో నారాయణను హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో విచారించుకోవచ్చని సీఐడీకి హైకోర్టు తెలిపింది.ఈ నేపధ్యంలో నారాయణను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ విచారణ చేస్తూవున్నది.