AMARAVATHIDISTRICTS

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి..

అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8 నుంచి 12 తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రెగ్యులర్‌గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఏర్పాటు చేశామని APSRTC  MD.ద్వారకా తిరుమలరావు తెలిపారు..హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ 339 సర్వీసులు అందిస్తుండగా, 11వ తేదీన అదనంగా 302 సర్వీసులు, 12వ తేదీన 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు..శనివారం హైదరాబాద్ నుంచి ఒంగోలుకు 38, ఏలూరుకు 20 బస్సులు, మచిలీపట్నానికి 23, విజయవాడకు 45, గుంటూరు 18, నరసరావు పేట 26, నెల్లూరు 17, నంద్యాల 19, విశాఖపట్నంకు 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు వివరించారు.. హైదరాబాద్‌లోని BHEL,MGBS,GBS, ECIL, జీడిమెట్ల, రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక బస్సులు సేవాలు అందిస్తున్నాయన్నారు.
బెంగుళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు శనివారం నుంచి మొత్తం 323 బస్సులు, 12 న 269 బస్సులు APSRTC నడపనున్నదని తెలిపారు..రెగ్యులర్‌గా నడిచే బస్సులతో పాటు అదనంగా ఈ బస్సులను ఏర్పాటు చేసినట్లు ద్వారకా తిరుమలరావు తెలిపారు.. ఈ ప్రత్యేక బస్సులు కూడా సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయని వెల్లడించారు..అదే విధంగా ఓటు వేసి తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు..ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజా రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *