AMARAVATHI

కొన్ని సంపన్న కుటుంబాలు విదేశాల్లో వివాహాలు చేసుకొవడ భావ్యమేనా? ప్రధాని మోదీ

అమరావతి: దేశంలో “పెళ్లిళ్ల సీజన్ మొదలైంది” ఈ సీజన్ లో దాదాపు రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనాలు వేసుకున్న వాణిజ్య సంస్థలు, వినియోగదారులకు అవసరమైన ఉత్పత్తులను అందించేందుకు సిద్దమౌతుయన్నారు.. పెళ్లిళ్ల కోసం షాపింగ్ కు వెళ్లినప్పుడు దేశవాళీ ఉత్పత్తుల కొనుగోలుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు..అదివారం మన్ కీ బాత్ 107వ ఎడిషన్ సందర్బంలో అయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలోని కొన్ని ఉన్నత కుటుంబాలు విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకోవడాన్ని ప్రధాని ప్రస్తావించారు.. ఈ వేడుకలను భారత్ లోనే చేసుకువాలని వారికి విజ్ఞప్తి చేశారు.. దినివల్ల దేశంలోని నగదు దేశాన్ని వీడి వెళ్లదన్నారు.. వివాహాల కోసం షాంపింగ్ చేసేటప్పుడు భారతదేశంలో తయారైన ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు..

”వివాహాల అంశం చర్చలకు వచ్చిన సందర్బంలో ఒక విషయం నన్ను చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది.. నా మనసులోని ఆవేదన నా కుటుంబ సభ్యులకు కాకుండా ఎవరికి చెప్పుకోగలను ? ఒక్కసారి ఆలోచించండి..ప్రస్తుతం కొత్త సంప్రదాయం నడుస్తోంది.. కొన్ని సంపన్న కుటుంబాల వారు విదేశాలు వెళ్లి అక్కడ వివాహాలు చేసుకుంటున్నారు..మన దేశంలో లేని సదరు దేశాల్లో వున్నాయా?’ అని ప్రశ్నించారు.. అదే ఇండియాలోనే వివాహ సంబరాలు చేసుకుంటే దేశ ప్రజల మధ్య చేసుకున్నట్టు ఉంటుందని,, దేశంలోని సొమ్ము దేశంలోనే ఉంటుందని అన్నారు.. ఇక్కడి ప్రజలకే సేవల రూపంలో కానీ, మరో రూపంలో కానీ అవకాశాలు ఇచ్చినట్టు కూడా ఉంటుందని తెలిపారు.. పేద ప్రజలు కూడా మీ వివాహాల గురించి తమ పిల్లలకు గొప్పగా చెబుతారని,, వోకల్ ఫర్ లోకల్ ను మరింత ముందుకు తీసుకువెళ్లినట్టు అవుతుందని తెలిపారు.. తన ఆవేదన తప్పనిసరిగా ఉన్నత కుటుంబాల వారు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు అన్నారు..

పండుగల సీజన్ లో “వోకల్ ఫర్ లోకల్” ప్రాధాన్యత గురించి తాను చెప్పడం జరిగిందని, ఆ తరువాత కొన్ని రోజులకే దీపావళి, రాఖీ, ఛాత్ పండుగల్లో రూ.4 లక్షల కోట్లు విలువ చేసే స్వదేశీ ఉత్పత్తుల వ్యాపారం జరిగిందని ప్రధాని వెల్లడించారు..స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్దఎత్తున ఆసక్తి కనబరిచారన్నారు..నేడు మన పిల్లలు సైతం షాపులో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువు ఇండియాలో తయారైందా లేదా అని దానిపై వివరాలను చూసి కొనుగోలు చేయడం మొదలైందన్నారు..ఈ పరిస్థితి మరింత బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, ఉపాధికి గ్యారెంటీ ఉంటుందని, ఇది దేశాభివృద్ధికి దారితీస్తుందని చెప్పారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

4 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

6 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

9 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

10 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

13 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.