AMARAVATHIPOLITICS

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా నర్తకీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభకు చేరుకుని ప్రసంగించారు.తొలుత ప్రసంగన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సింహపురి ప్రజలందరికి నమస్కారాలు తెలియచేస్తూ, ముందుగా చంద్రబాబు మాట్లాడుతాడని తెలిపారు.చంద్రబాబు మాట్లడుతూ నెల్లూరు,తిరుపతి, మద్రాసులను కలుపుతు ఒక ట్రై సిటీ హబ్ తయారు చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎందుకంటే నెల్లూరులో దగదర్తి దగ్గర ఎయిర్ పోర్టు,తిరుపతిలో రేణిగుంట వద్ద మరో ఎయిర పోర్టు,మద్రాసులో ఎయిర్ పోర్లు వున్నాయిని,,దిని వల్ల ఎక్స్ పోర్టు చేసేందుకు కంపెనీల ప్రతినిధులు  ఈ ప్రాంతాలకు వచ్చేందుకు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. నెల్లూరులో కృష్ణపట్నం పోర్టు వుందని,ఎగుమతులకు అనువైన ప్రాంతంగా తీర్చి దిద్దడం జరుగుతుందన్నారు.

పవన్: చిన్నప్పటి జ్ఞాపకాలు ట్రంక్ రోడ్డులో భవాని బుక్ సెంటర్ ని చూస్తుంటే గుర్తుకు వస్తున్నాయి.నేను ఒకప్పుడు తిరిగిన ట్రంక్ రోడ్డేనా అని అన్పించింది.నేను పెట్టి పుట్టలేదు,మనం ఏం కావాలని కోరుకుని, కష్టపడతామో అదే విధంగా జీవితంలో ఎదుగుతామన్నారు. ఎన్నికలకు ముందు జరిగిన ఎన్డీయే సమావేశంలో నా అబిప్రాయం తెలియచేస్తూ,మన దేశంలో నదులు కాదు,ఖనిజలు కాదు కలలతో నిండిన యువతే మన సంపాద అని తెలియచేయడం జరిగిందన్నారు. రాష్ట్రాని అభివృద్ది బాటలో నడిపించేందుకు చంద్రబాబు అనుభవం,జనసేన పోరాట పటిమ,బీజెపీ ముందుకు చూపు పనిచేస్తుందన్నారు. మేము ఎన్ని చెప్పిన ఓటు రూపంలో మీ భవిష్యతును నిర్ణయించుకునేది మీరే అని,,మే 13వ తేదిన ఆలోచించి కూటమి అభ్యర్దులకు ఓటు వేయాలని కోరారు. కూటమి తరపున తాము వంగి నమస్కారం చేస్తు మిమల్ని ఓటు అడుతుంటే, సైకో జగన్ వేలు మీ వైపు చూపిస్తూ,సిద్దమా అంటూ భయపెడుతు ఓటు అడగడం ఏమిటని మండిపడ్డారు. గాజు పగిలే కొద్ది పదునెక్కుతుందంటూ కూటమి గెలుపును ప్రస్తవించారు. మనం అంత కలసి పిడికెడు మట్టి కావచ్చు,అందరం ఐక్యంగా కదిలితే దేశపు జెండాకు వున్నంత శక్తి వుంటుందన్నారు. నెల్లూరు సిటీ అభ్యర్దిగా పొంగూరు.నారాయణ,నెల్లూరు రూలర్ అభ్యర్దిగా శ్రీధర్ రెడ్డి, ఎం.పీ అభ్యర్దిగా వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *