HYDERABAD

వినాయక్ సాగర్ (హూస్సేన్ సాగర్)లో  నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభం

హైదరాబాద్: గణేష్ ఉత్సవ సమితి నాయకులు నిరసన దీక్షకు దిగడంతో,,బీజెపీ అధ్యక్షడు,ఎం.పీ బండి.సంజయ్ బుధవారం వినాయక్ సాగర్ (ట్యాంక్ బండ్) ప్రాంతాన్ని సందర్శించి,ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.పరిస్థితి తీవ్ర రూపందాల్చచడంతో,,తెలంగాణ ప్రభుత్వం దిఎప్పటి లాగానే గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు ప్రారంభించారు..బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం ట్యాంక్ బండ్ పై 8 క్రేన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్ లను ఏర్పాటు చేస్తున్నారు..అలాగే ఎన్టీఆర్ మార్గం మీద మరో 9 క్రేన్లు, పీపుల్స్ ప్లాజాలో 3 క్రేన్లు, రెండు బేబీ పాండ్ల వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ లో గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. ఏయే రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టతను ఇచ్చారు..అలాగే వినాయక నిమజ్జనం కోసం రాచకొండ పరిధిలోని సరూర్ నగర్, నల్ల చెరువుకట్ట ఉప్పల్, సఫిల్ గూడ లాంటి ఇతర ట్యాంక్ లపైనా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఇప్పటికే అవసరమైనన్ని క్రేన్లు అందుబాటులో ఉంచారు. కేవలం మట్టి గణేష్ విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు అవకాశం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే  అన్ని రకాల వినాయకుల నిమజ్జనానికి అనుమతినివ్వాల్సిందేనని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ డిమాండ్ చేస్తోంది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *