EDUCATION JOBS

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి-జాయింట్ కలెక్టర్

నెల్లూరు: ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4వ తేది వరకు జరుగబోవు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా చేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కుర్మనాధ్ తెలిపారు.గురువారం జేసి చాంబర్ లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సన్నాహాక సమావేశం నిర్వహించారు. తోలుత ఇంటర్మీడియట్ పరీక్ష ఏర్పాట్ల పై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి టి.వరప్రసాద్ రావు వివరించారు.అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 52903 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారన్నారు. ఇందుకోసం జిల్లాలో 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా 4 ఫ్లయింగ్ స్కాడ్ లను, 5 సిటింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేసామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలోని అన్ని రూములలో సి సి కెమెరాలు ఏర్పాటు చేసామన్నారు. కంట్రోల్ రూమ్ నుండి పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పరీక్షలు జరుగు ప్రదేశాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కు చర్యలు తీసుకోవలసిందిగా విద్యుత్ శాఖాధికారులకు సూచించారు. అవసరమైన రూట్లలో ప్రత్యేకంగా RTC బస్ సర్వీసులు ఏర్పాటు చేయవలసిందిగా RTC అధికారులకు సూచించారు. ఈ వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *