సీ.ఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటనకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొవడం,తిరుగు ప్రయాణం

తిరుపతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలోని నేలటూరు గ్రామంలో ఏపీ జెన్కో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ మూడో యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొనటానికి రేణిగుంట విమానాశ్రయానికి ఉదయం 10:35 గంటలకు చేరుకున్న వీరికి ఘన స్వాగతం లభించింది…
ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు:- నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం 02:25 గంటలకు చేరుకున్న సీ.ఎంకు మంత్రులు,అధికారులు తదితరులు సాదర వీడ్కోలు పలకగా ముఖ్యమంత్రి మధ్యాహ్నం 02.35 గం.లకు హెలికాప్టర్లో తిరుగు పయనమైయ్యారు.