AMARAVATHI

79 శాతంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రదాని మోదీ

అమరావతి: భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఖ్యాతిని కైవసం చేసుకున్నారు..అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ ఈ వివరాలను వెల్లడించింది..78 శాతం ఆమోదంతో నరేంద్రమోడీ,,మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ గా అవతరించారు..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, యూకే పీఎం రిషి సునాక్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.. మొత్తం 22 మంది గ్లోబల్ లీడర్లపై ఈ సంస్థ సర్వే చేసింది. గ్లోబల్ లీడర్ అఫ్రూవల్ సర్వే ఈ సంవత్సరం జనవరి 26-31 నుంచి సేకరించిన డేటా ఆధారం ఈ ర్యాకింగ్స్ ఇచ్చారు..ఒక్కో దేశంలో ప్రజల 7 రోజుల సగటును తీసుకుని ఈ నివేదికను తయారు చేశారు.. ఈ సర్వేలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు 40 శాతం ప్రజామోదం లభించింది.. 78 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీని ఆమోదించగా,,18 శాతం మంది ఆయనను తిరస్కరించారు..ప్రధాని మోడీ ఆమోదం రేటింగ్ ఇటీవల పెరిగింది, జనవరి మూడో వారంలో 79 శాతానికి చేరుకుంది..అమెరికా అధ్యక్షుడు జోబిడైన్ 7వ స్థానంలో ఉన్నారు.. 22 దేశాల అధినేతల ర్యాకింగ్స్ లో నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సియోక్-యుల్,,జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చివరి నుంచి మూడు స్థానాల్లో ఉన్నారు..

మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 68 శాతం రేటింగ్‌లతో రెండో స్థానంలో, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ 62 శాతం ఆమోదం రేటింగ్‌తో మూడో స్థానం కైవసం చేసుకున్నారు.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ 58 శాతం ఆమోదంతో 4వ స్థానంలో, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడ సిల్వా 50 శాతం రేటింగ్‌లతో 5వ, ఇటలీకి ఇటీవల కొత్తగా ఎన్నికైన జాతీయవాద నాయకురాలు జార్జియా మెలోని 52 శాతం రేటింగ్ తో 6వ స్థానంలో, కెనడా ప్రధాని 40 శాతం ఆమోదాలతో 9వ స్థానంలో, యూకే ప్రధాని రిషి సునాక్ 30 శాతం ఆమోదాలతో 12వ స్థానంలో నిలిచారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *