రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి..ఈ సమావేశాల్లో ప్రధానంగా రాజధాని అంశం,,పోలవరం వంటివి చర్చకు వచ్చే అవకాశం ఉంది..సభ ప్రారంభమైన మొదటి రోజున మూడు రాజధానులపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు..ఇప్పటికే మూడు రాజధానులు రెఫరెండంగా ఎన్నికలకు వెళ్తామని వైసీపీ ప్రకటించింది..ఈ అంశంతోపాటు పోలవరం పనుల పురోగతి, డయాఫ్రం వాల్ డ్యామేజీ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ సమావేశాల్లో అధికార వైసీపీని ప్రజా సమస్యల విషయంలో ఇరుకున పెట్టాలని టీడీపీ భావిస్తోంది..ఈ సభలో 15 అంశాలు లేవనెత్తాలని టీడీఎల్పీ నిర్ణయించినట్లు సమాచారం..