అమరావతి: ఢిల్లీలో ఓ యువకుడు బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న బాలికపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను వెంటనే సఫ్దర్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు..ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని,, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలిక నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని ద్వారక సెక్టర్ ప్రాంతంలో ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి,తన సోదరుడితో కలసి నడిచిపోతున్న సమయంలో యువతిపై యాసిడ్ చల్లేడు..ఈ సంఘటన మొత్తం సి.సి కెమెరాలో రికార్డుల అయ్యింది.దాడి చేసిన యువకుల పేర్లను యువతి పోలీసులు తెలిపింది. ఘటనకు సంబంధించిన ఇద్దరిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం..ఘటనకుగల కారణాలు తెలియాల్సి ఉంది. యాసిడ్ దాడికి పాల్పడిన బాలుడు ఎవరు..? అతను కూడా బాలికతోపాటు అదే పాఠశాలలలో చదువుతున్నాడా..? లేదంటే బయటి వ్యక్తా..? అతను బాలికపై ఎందుకు యాసిడ్ దాడి చేయాల్సి వచ్చింది..? అనే కోణాల్లో తాము కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.
Acid attack case in Delhi #crime
Delhi boy throws acid on 17-year-old schoolgirl in Dwarka; one detained
Acid fell on the girl's face and eyes.#AcidAttack #IndiaChina #TejRan pic.twitter.com/lMSFNDmGce
— Kumari Dimple 💯% Follow Back. (@KumariDimple5) December 14, 2022