CRIMEHYDERABAD

ICFAI Business School విద్యార్దిపై మనోభావలు దెబ్బతిన్నాయంటూ దాడి

హైదరాబాద్‌: ఉన్నత విద్య చదువుతున్న వారికి సంస్కరం బదులు ఉన్మాదం పెరిగిపోతుంది అనేందుకు హైదరాబాద్ లో శనివారం చోటు చేసుకున్న సంఘటనే ఉదహరణ :-వివరాల్లోకి వెళ్లితే… హైదరాబాద్‌లోని IBS (ICFAI Business School) కళాశాల క్యాంపస్‌లో విద్యార్థి హిమాంక్ బన్సాల్‌ను ఇన్‌స్టిట్యూట్‌లోని హస్టల్ లో ఇతర విద్యార్థులు దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హాస్టల్ గదిలో బన్సల్‌ను కొందరు యువకులు కొట్టడం, బెదిరించడం వంటి దృశ్యాలు కన్పిస్తున్నాయి.దాడి తరువాత.. బన్సల్ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై దాడికి దారితీసిన పరిస్థితులను ఫిర్యాదులో వివరంగా పేర్కొన్నాడు. B.A-LLB కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్న తన స్నేహితుల్లో ఒకరు, తన కంటే మూడున్నరేళ్లు చిన్న అమ్మాయితో స్నేహం చేస్తున్నందుకు తనను తిట్టారని బన్సల్ తన ఫిర్యాదులో తెలిపాడు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ 15 నుంచి 20 మంది విద్యార్దులు తన హాస్టల్ గదిలోకి చొరబడి కొట్టారని,, నన్నుకొట్టేటప్పుడు అల్లా-హు-అక్బర్ అని చెప్పాలని హెచ్చరించారని బన్సల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కొట్టడమే కాకుండా తన పట్ల అసభ్యకరంగా వ్యవహరించారని వెల్లడించారు. బన్సాల్ ఫిర్యాదుతో పాటు దాడికి సంబంధించిన వీడియో, ఫోటో ఆధారాలను కూడా పోలీసులకు అందచేశాడు.అతని ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు శనివారం శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన విద్యార్థులతో పాటు హిమాంక్ బన్సాల్‌పై కూడా IBS ఇన్సిట్యూట్ చర్యలు ప్రారంభించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *