అమరావతి: కరోనా-19 కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పెరుగుతున్న నేపధ్యంలో,తాజా పరిస్థితిపై – ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ తదితరులు పాల్గొన్న వర్చువల్ సమావేశంలో కొవిడ్-19పై ప్రధాని సమీక్ష జరిపారు. ముఖ్యంగా వైద్య శాఖాధికారులతో ప్రస్తుత పరిస్థితిని, సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. తాజాగా ఎన్నికేసులున్నాయి,, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అడిగి తెలుసుకున్నారు. జనసమర్థ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని ప్రధాని సూచించారు..ఎయిర్‌పోర్టుల వద్ద అప్రమత్తత పెంచాలని అలాగే వృద్ధులు, వయసులో పెద్దవారు ప్రికాషనరీ డోస్ తీసుకునేలా మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ తో పాటు వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల సంఖ్యను పెంచాలని చెప్పారు. కోవిడ్ చికిత్సకు అవసరమయ్యే మందులు, తగినంత సంఖ్యలో వైద్య సిబ్బంది, ఇతర మానవ వనరులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌తో పాటు టెస్టులపై శ్రద్ధ పెంచాలని ప్రధాని అధికారులకు సూచించారు.