DISTRICTS

సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి-విజయ కుమార్

నెల్లూరు: మానవ అభివృద్ది కోసం నిర్ధేశించిన సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనకు అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం వుందని రాష్ట్ర ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక శ్రీ వేంకటేశ్వర కస్తూరిభా కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయి అధికారులతో  సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలు,,స్పందన పై వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విజయ కుమార్ మాట్లాడుతూ, ధనిక, పేదల మధ్య తీవ్రస్థాయిలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి 2016-2030 మిలీనియం సమీకృత అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. అందులో బాగంగా పేదరికం, ఆకలి నివారించి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం వంటి  అంశాలతో కూడిన  లక్ష్యాల సాధనకు ప్రపంచ వ్యాప్తంగా 8 అంశాలు, 18 లక్ష్యాలు, 56 సూచికలుతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ  స్పందన పేరును నిర్ధారించడం జరిగిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పని తీరుకు స్పందన కార్యక్రమం అద్దం పట్టేలా పనిచేయాలన్నారు.జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, మొదటి నుంచి నెల్లూరు జిల్లా గుడ్ గవర్నెస్ కు పెట్టింది పేరన్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మమేకం చేస్తూ అధికారులు ఎలా ప్రవర్తించాలి అని ఎందరో అధికారులు జిల్లాలో చెరగని ముద్ర వేశారని, అటువంటి గొప్ప వారిలో ఎస్.ఆర్.శంకరన్ గారు ఒకరని గుర్తుచేశారు.తొలుత స్పందన అర్జీల పరిష్కార విధానం,శాఖల వారీగా నిర్ధేశించిన సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలకు చెందిన రాష్ట్ర రిసోర్స్ పర్సన్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో జె.సి కూర్మనాథ్, నెల్లూరు నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీమతి హరిత, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీమతి శోభిక, ఆడిషనల్ ఎస్.పి. శ్రీమతి హిమవతి, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్.డి.ఓలు మలోల,శీనా నాయక్, శ్రీమతి కరుణకుమారి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *