అమరావతి: కర్ణాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో బాంబ్ పేళ్లులపై వేంగగా దర్యాప్తు జరుగుతోందని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు.బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు, కేరళ డీజీపీలతో నిరంతరం అందుబాటులో ఉన్నామని, నిందితుడు మహ్మద్ షరీఖ్ వెనక ఎవరు ఉన్నారనే దానిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నమన్నారు. కొన్ని వర్గాల మధ్య గొడవలు సృష్టించడమే టెర్రరిస్టుల ప్రధాన లక్ష్యమని డీజీపీ వెల్లడించారు. ఈ కేసులో ఎన్ఐఏ సహా సెంట్రల్ ఏజెన్సీలు భాగస్వామ్యం అయ్యాయని,ఇందులో బాగంగా నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తోందని తెలిపారు.జరిగిన సంఘటనలో నిజాలు నిగ్గుతేల్చేందుకు కొంత సమయం పడుతుందని వెల్లడించారు. పేలుళ్లకు కుట్ర పన్నిన మహ్మద్ షరీఖ్‌కు సహకరించిన ఇద్దరిని కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. షరీఖ్‌తో ఎలాంటి సంబంధాలున్నాయి ? ఇంకా ఎవరెవరితో పరిచయముంది అన్న అంశాలపై ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. పేళ్లుల సంఘటనకు సంబంధించి ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించిన NIA,, దీని వెనుక ఉగ్రసంస్థలు ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారించారు.