x
Close
DISTRICTS

భారత స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రజల్లో నింపడమే లక్ష్యంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్-జె.సి

భారత స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రజల్లో నింపడమే లక్ష్యంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్-జె.సి
  • PublishedAugust 13, 2022

నెల్లూరు: ఆగష్టు 15వ తేది నాటికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సమయంలో,భారత స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రజల్లో నింపడమే లక్ష్యంతో  నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో కుల, మతాలకు అతీతంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాలు పంచుకోవడం జరుగుతుందని,ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్ పిలుపునిచ్చారు.. శనివారం సాయంత్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్-హర్ ఘర్ తీరంగా కార్యక్రమాల్లో భాగంగా జిల్లా రెడ్ క్రాస్ సంస్థ, కృష్ణచైతన్య విద్యా సంస్థ సంయుక్తంగా వి.ఆర్.కళాశాల గ్రౌండ్ లో గాలిపటాల ఎగురవేత కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి,బెలూన్లను ఎగురవేశారు.ఈ సంధర్బంగా జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, రెడ్ క్రాస్ సంస్థ, కృష్ణచైతన్య విద్యా సంస్థల ఆద్వర్యంలో గాలిపటాల ఎగురవేత కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా  ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేస్తూ పండుగ వాతావరణంలో హర్ ఘర్ తీరంగా కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు..రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు పి.చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ,భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో ఆగస్టు,1వ తేదీ నుంచి ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించేలా జిల్లాలో  అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నయన్నారు.రెడ్ క్రాస్ సంస్థ అధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన నెల్లూరు నగరం నుంచి దాదాపు 13 కిలో మీటర్ల దూరంలో వున్న పల్లిపాడు పినాకినీ గాంధీ ఆశ్రమం వరకు వారసత్వ నడకను నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ,జిల్లా పరిషత్ సి.ఈ.ఓ శ్రీమతి వాణీ, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, జిలా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీమతి కనక దుర్గా భవానీ, రెడ్ క్రాస్ సంస్థ వైస్ ఛైర్మన్ దామిశెట్టి సురేష్ నాయుడు, రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు, కృష్ణ చైతన్య విద్యా సంస్థ విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.