AMARAVATHIPOLITICS

పొత్తులపై స్పష్టత కోసం ఢిల్లీకి బయలుదేరుతున్న బాబు,,పవన్

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో జనసేన,,టీడీపీ బీజెపీ పొత్తులపై ఇప్పటికి అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి..అయితే ఇప్పటి వరకు బీజెపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు రాకపొవడంతో,,వీరి పొత్తు పొడవదని వైసీపీ ద్వితీయశ్రేణి నాయకులు వ్యాఖ్యనిస్తున్నారు..దింతో టీడీపీ,,జనసేన నాయకుల్లో కూడా కొంత అయోమయం నెలకొంది..వీటన్నింటికి తెరదించడంతో పాటు తొందరలోనే రెండవ జాబిత అభ్యర్దుల పేర్లను ప్రకటించేందుకు బాబు,,పవన్ రంగం సిద్దం చేసుకున్నారు..ఈ నేపధ్యంలో బీజెపీ అగ్రనాయకత్వం నుంచి స్పష్టంత తీసుకునేందుకు గురువారం హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పయనమయ్యారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.. రాత్రి 9 గంటల తరువాత అమిత్ షా,,జెపి నడ్డాలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా భేటీ అయ్యే అవకాశం ఉంది..వీరి సమావేశం తరువాత రాష్ట్రంలో పొత్తులు,, సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది…పొత్తులపై స్పష్టమైన ప్రకటన వీలైతే రాత్రికి లేదంటే రేపు ఉదయం వెలువడే అవకాశం వుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *