x
Close
CRIME HYDERABAD

అయ్యప్ప జన్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి.నరేశ్ అరెస్ట్

అయ్యప్ప జన్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి.నరేశ్ అరెస్ట్
  • PublishedDecember 31, 2022

హైదరాబాద్: అయ్యప్ప జన్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వరంగల్ జిల్లాకు చెందిన బైరి.నరేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు..నరేష్ పై కొండగల్ లో కేసు నమోదు కావడంతో అతడిని అక్కడికి తరలిస్తున్నారు..అయ్యప్పస్వామిపై బైరి నరేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్పస్వాములు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు..అతనిపై పి.డీ యాక్టు క్రింద కేసు నమోదు చేసి కఠింనంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..హిందువుల మనోభావాలను కించపరిచన నరేష్‌ సహాయకుడు అయిన సతీష్,,అయ్యప్ప స్వాములు భక్తులు నిరసనలు తెలియచేస్తున్న సమయంలో,,వీడియో చిత్రికరించేందుకు ప్రయత్నించడంతో,వారు చితకబాదారు..నరేష్ ను అరెస్ట్ చేశామని,,అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి కోరారు..అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని,,ఇప్పటి వరకు 200 పోలీస్ స్టేషన్లలో నరేష్ పై కేసులు నమోదయ్యాయని తెలిపారు. 

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.