జామా మసీదులోకి మహిళల ప్రవేశంపై వున్న నిషేధం ఉపసంహరణ

అమరావతి: ఢిల్లీ జామా మసీదులోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిడంపై తీవ్ర విమర్శలు వస్తూన్న నేపథ్యంలో..మసీదు యాజమాన్యం నిషేధం ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంది.ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదులోకి,మహిళ ప్రవేశాన్ని యాజమాన్యం నిషేదించింది.ఒంటిరిగా లేక బృందంగా వచ్చిన సరే అమ్మాయిలకు ప్రవేశంలేదని,జామా మసీదు మూడ ప్రవేశ ద్వారాల వద్ద నోటీసులు అంటించింది.యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ వివరణ ఇస్తూ,మసీదులో ప్రార్దనలకు వచ్చేవారిపై,ఎలాంటి ఆంక్షలులేవన్నారు. గురువారం కూడా 25 మంది అమ్మాయిలు వచ్చి ప్రార్ధనలు చేసినట్లు తెలిపారు.కొంత మంది అమ్మాయిలు ఇక్కడకు ఒంటరిగా వచ్చి తమ ప్రియుల కోసం ఎదురుచూస్తూన్నరని ఆరోపించారు. మసీదులు,ఆలయాలు,గురుద్వారాల్లో ఇలాంటి చర్యలను అనుమతించరని చెప్పారు.ప్రార్దనా మందిరాలు దైవాన్ని ఆరాధించడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. హెరిటేజ్ నిర్మాణమైన జామా మసీదులో కొన్ని సంఘటనలు చోటుచేసుకోవడంతో,మహిళలపై నిషేధం విధించామని బుఖారీ తెలిపారు.ప్రార్దనలు చేసే వారికి ఎలాంటి ఆంక్షలు లేవన్నారు…ఢిల్లీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ ఈ నిర్ణయంను ఖండించారు.మహిళల హక్కుల ఉల్లఘనపై ఇమామ్ కు నోటీసులు ఇచ్చారు.ప్రార్దన చేసుకోవడానికి పురుషులకు ఎంత హక్కు వుందో,మహిళలకు అంతే హక్కు వుందన్నారు.గురువారం సాయంత్రం ఢిల్లీలెఫ్టినెంట్ గవర్నర్ కూడా జోక్యం చేసుకున్న కొద్ది సేపటికి నిషేధం ఉత్తర్వుల్ని ఉపసంహరించుకున్నట్లు జామా మసీదు వర్గాలు ప్రకటించాయి.