x
Close
NATIONAL

కర్ణాటకలో ఓలా,,ఉబర్,,ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం

కర్ణాటకలో ఓలా,,ఉబర్,,ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం
  • PublishedOctober 7, 2022

అమరావతి: కర్ణాటక రాష్ట్రంలో బొమ్మై ప్రభుత్వం, ఓలా,,ఉబర్,,ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూల్ చేస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో,, 3 రోజుల్లో సర్వీసులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఓలా, ఉబర్లు 2 k.m కంటే తక్కువ దూరం ఉన్నప్పటికీ 100 రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఎక్కువ ప్రయాణికుల నుంచి మీటర్ తో సంబంధం లేకుండా అధిక ధరలు వసూల్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే వాటిని నిషేధిస్తున్నామని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టీహెచ్ఎం కుమార్ వెల్లడించారు. On-Demand Transportation Technology Act 2016 క్రింద సదరు సంస్థలకు నోటీసులు ఇచ్చారు. కర్ణాటకలో కనీస ఆటో చార్జ్ మొదటి 2 కిలోమీటర్లకు రూ.30, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ కు రూ.15గా నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ధేశించిన చార్జీల కంటే క్యాబ్లలో ఎక్కువ ఛార్జీలు వసూల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మరి ఈ సంస్థలు దిగివస్తాయో లేదొ వేచి చూడాలి.? 

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.