ప్లాస్టిక్ కవర్ల నిషేధం కఠినంగా అమలు చేస్తాం-కమిషనర్ శ్రీమతి హరిత

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, అమ్మకం, వాడకం తదితర అంశాలపై దృష్టి సారించి, నిబంధనలను కఠినంగా అమలుచేయాలని కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు.ఈ సందర్బంలో కమీషనర్ మాట్లాడుతూ నిషేధిత ప్లాస్టిక్ ఉత్పాదక సంబంధిత వాణిజ్య కేంద్రాలపై దాడులు నిర్వహించి జరిమానాలు విధించాలని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.డస్ట్ బిన్ ల నిర్మూలనతో అన్ని డివిజనుల్లో పశువులు, కుక్కలు, పందులకు ఆవాసం ఏర్పడకుండా జాగ్రత్తలు వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందికరంగా మారిన పశువులు, పందుల ఏరివేతను స్పెషల్ డ్రైవ్ ల ద్వారా ప్రణాళికాబద్ధంగా చేపట్టి, పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టంగా నిర్వహిస్తామని కమిషనర్ వెల్లడించారు.