అమరావతి: సంప్రదాయంను కాపాడుకుంటూ, సాంకేతికత నైపుణ్యంలో వేగంగా అడుగులు వేస్తున్న నగరం బెంగళూరు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఇన్వెస్ట్ కర్ణాటక 2022 సమ్మిట్లో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.ఈ సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని,ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్దిక మాద్యం కమ్ముకుని వస్తున్న సమయంలో కూడా ఆర్థిక వేత్తలు, నిపుణులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రశంసిస్తున్నారన్నారని పేర్కొన్నారు. పెట్టుబడి దారులను, రెడ్ టాపిజం నుంచి విముక్తి చేసి, వారికి రెడ్ కార్పెట్ అవకాశాలు కల్పించామన్నారు. గతంలో మూసివేయబడిన ప్రైవేటు పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తున్నమని ఇందులో బాగంగా స్పేస్, డిఫెన్స్, డ్రోన్స్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించామన్నారు. కరోనా తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని,ఇలాంటి సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రాథమిక అంశాలపై పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆర్థిక సంక్షోభం నుంచి దేశం శరవేగంగా బయటపడుతుందని ఆర్థికవేత్తలు చెప్పినట్లు గుర్తు చేశారు. వివిధ దేశాలతో కేంద్రం చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు.