x
Close
NATIONAL

భారతదేశ అందాలను మాటల్లో నిర్వచించలేము-ప్రధాని మోదీ

భారతదేశ అందాలను మాటల్లో నిర్వచించలేము-ప్రధాని మోదీ
  • PublishedJanuary 13, 2023

ఆరంభంమైన గంగా క్రూయిజ్ ప్రయాణం..

అమరావతి: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ ఎంవీ గంగా విలాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు..తొలుత వారణాసిలో టెంట్ సిటీని ప్రారంభించడంతో పాటు రూ.1000 కోట్ల విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ  శంకుస్థాపన చేశారు..భారతదేశంలో మీరు ఊహించన వాటి కంటే,,మీ ఊహకు మించిన క్షేత్రలు వున్నయని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు..భారతదేశాన్ని మాటల్లో నిర్వచించలేమని,,ఇలాంటి విషయాలను మనం మనసు ద్వారానే అనుభూతి చెందగలమని పర్యాటకులకు ప్రధాని మోదీ చెప్పారు..ఈ కార్యక్రమంలో కేంద్ర జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర కేంద్ర మంత్రులు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు..ఈ గంగా విలాస్ భారతదేశ మొట్టమొదటి నదీ పర్యటక నౌక, గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక,,,ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌకగా కూడా ఖ్యాతిని సొంతం చేసుకుంది..

గంగా విలాస్ విశిష్టతలు:- ఎంవీ గంగా విలాస్, 51 రోజుల పాటు సాగే తన మొదటి పర్యటనను వారణాసి నుంచి శుక్రవారం ప్రారంభించింది.. భారత్‌లోని ఐదు రాష్ట్రాలను, బంగ్లాలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ మొత్తం 3,200 కి.మీ దూరం ప్రయాణించి దిబ్రూఘడ్ చేరుకుంటుంది..ఈ ప్రయాణంలో 27 నదీ వ్యవస్థల మీదుగా ఈ క్రూయిజ్ ప్రయాణించనుంది..ఈ క్రూయిజ్ తన మొదటి పర్యటనలో భాగంగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్‌లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాంలోని గువాహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాలను కవర్ చేస్తుంది.. ఎంవీ గంగా విలాస్ తన తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులను తీసుకెళ్లనుంది..

టికెట్‌ రేట్:- క్రూయిజ్ లో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో పాటు సూట్‌ గదులు,,స్పా,,జిమ్‌ సెంటర్లు,,ఫ్రెంచ్ బాల్కనీలు,, ఎల్ఈడీ టీవీలు,,విలువైన వస్తువులను దాచుకునేందుకు సేఫ్టి లాకర్స్,, స్మోక్ డిటెక్టర్లు,,కన్వర్టిబుల్ బెడ్లు వంటివి ఉన్నాయి..దీనికి రోజుకు రూ.25,000 నుంచి రూ.50,000 ఖర్చవుతుందని, 51 రోజుల ప్రయాణానికి మొత్తం ఖర్చు ఒక్కో ప్రయాణికుడికి దాదాపు రూ. 20 లక్షల వరకు ఉంటుందని క్రూయిజ్ డైరెక్టర్ రాజ్ సింగ్ తెలిపారు..ఈ క్రూయిజ్‌లో కాలుష్య రహిత వ్యవస్థ, శబ్ద నియంత్రణ సాంకేతికత అమర్చబడిందని వెల్లడించారు..ఈ క్రూయిజ్‌లో మురుగునీరు గంగలోకి ప్రవహించకుండా మురుగునీటి శుద్ధి కర్మాగారం ఉందని,,స్నానం, ఇతర అవసరాల కోసం గంగాజలాన్ని శుద్ధి చేసే ఫిల్ట్రేషన్ ప్లాంట్ కూడా ఇందులో అమర్చడం జరిగిందని తెలిపారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.