ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి-కలెక్టర్

నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో మానసిక ఒత్తిడితో పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారని,వారందరికీ వైద్య సేవలు అందించేందు కోసం ప్రత్యేకించి ఒక దీర్ఘకాలిక వ్యాధుల ఔట్ పేషంటు విభాగాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు.సోమవారం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) క్రింద ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీర్ఘకాలిక వ్యాధుల ఔట్ పేషంట్ విభాగాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నుంచి శనివారం వరకు,,ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ విభాగం పనిచేసేలా చూడాలన్నారు.. ఉద్యోగులను ఎవరిని వేచి ఉండేలా చేయకుండా త్వరగా పరీక్షించి పంపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు..జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.అంతకు మునుపు GGH పర్యవేక్షకులు డాక్టర్.సిద్ధానాయక్ మాట్లాడుతూ ఓపి విభాగంలో డాక్టర్ కన్సల్టేషన్ గది, రిసెప్షన్ గది, వివిధ రకాల నమూనాల పరిశీలించే ప్రయోగశాల ఉన్నాయని కలెక్టర్ కు వివరించారు. డాక్టర్ల సూచన మేరకు మందులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.జనరల్ మెడిసిన్,ఎముకలు కీళ్లు,మానసిక,చర్మ,ఉదరం,గుండె సంబంధ వ్యాధులు ఎండోక్రైనాలజీ ఊపిరితిత్తులు మూత్రపిండాలు, మధుమేహం, రక్తపోటు,పార్కిన్ సన్,మూర్ఛ తదితర 24 రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమన్వయకర్త శ్రీమతి లక్ష్మీ సునంద, సభ్యులు, పలువురు ప్రొఫెసర్లు పారామెడికల్, నర్సింగ్, ఫార్మసీ సిబ్బంది,ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.