ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటూ మెరుగైన సేవలు అందించాలి-కలెక్టర్

నెల్లూరు: ప్రజలకు అందుబాటులో వుండి మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరువ చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.మంగళవారం ముత్తుకూరు మండల పరిధిలోని కృష్ణపట్నం, బ్రహ్మదేవి గ్రామాల్లోని సచివాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.సచివాలయ పరిధిలో ప్రతి రోజు ఎన్ని అర్జీలు వస్తున్నాయి, వచ్చిన అర్జీల్లో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని బియాండ్ ఎస్.ఎఎల్.ఎ లో వున్నాయి అని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు నిత్యం అందుబాటులో వుండి, ప్రజలు సంతృప్తి చెందేలా మెరుగైన సేవలు అందించాలన్నారు.ఈ సందర్భంగా సచివాలయ హాజరు రిజిస్టర్ ను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రెవెన్యూ సర్వీసెస్ పై ప్రజల్లో అవగాహన కల్పించి రెవెన్యూ సర్వీసెస్ ను ఇంప్రూవ్మెంట్ చేయాలని కలెక్టర్, సచివాల సిబ్బందిని ఆదేశించారు.సచివాలయ పరిధిలో బూస్టర్ డోసు ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని ఏ.ఎన్.ఎంలను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట ముత్తుకూరు మండల ప్రత్యేక అధికారి సోమయ్య, తహసిల్ధార్.మనోహర బాబు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.