హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్,, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకొనున్న సినిమా టైటిల్ ఖరారైంది..ఇంతకు మునుపు ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు.కొంతకాలంగా సినిమాకు సంబంధించి స్తబ్దతగా వున్న చిత్ర బృందం, తాజాగా సినిమా పేరును మారుస్తూ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పేరుతో ఉన్న టైటిల్, పోస్టర్ ని విడుదల చేసింది. “మనల్ని ఎవడ్రా ఆపేది” అనే ట్యాగ్ లైన్ తో పాటు, “ఈ సారి కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు” అనే థీమ్ లైన్ కూడా ఇందులో చూపించారు.ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయాంక్ బోస్ సినిమాటోగ్రాఫర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా నిర్మిస్తున్నారు. సీనియర్ దర్శకుడు దశరథ్ స్ర్కిప్ట్ వర్క్ లో పనిచేస్తున్నడు. ఈ సినిమాని “తేరి” అనే తమిళ సినిమా రీ మేక్ గా తెరకెక్కిస్తున్నారని వార్తలు బయటకు రావడంతో, పవన్ అభిమానులు “రీ మేక్” వద్దని ట్విట్టర్ లో ట్రెండింగ్ చేశారు. దింతో సినిమా స్క్రిప్ట్ ని పూర్తిగా మార్చినట్లు సమాచారం.