బీజెపీ ఎమ్మేల్యే రాజాసింగ్ ముందస్తు అరెస్ట్

హైదరాబాద్: కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని మునావర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో,,శనివారం ఫారుఖీ షోను అడ్డుకుంటామనడం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు..దింతో పోలీసులు శుక్రవారం రాజాసింగ్ ను అరెస్ట్ చేసి,,లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు..మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకే మునావర్ హైదరాబాద్ వస్తున్నారు..మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీ షో రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో మునావర్ ఫారుఖీ షో నిర్వహించనున్నారు.. బుక్ మైషోలో మొత్తం టికెట్లను నిర్వాహకులు విక్రయించారు.. వేదికను తగలబెడతామని ఇప్పటికే బీజేవైఎం, రాజాసింగ్ హెచ్చరించారు. దీంతో మునావర్ ఫారుఖీ కామెడీ షోపై ఉత్కంఠ కొనసాగుతోంది..ఇప్పటివరకు అడ్వాన్స్ అమౌంట్ నిర్వాహకులు చెల్లించలేదు..హైదరాబాద్‌లో ఫారుఖీ షోకు అనుమతి ఇవ్వొద్దంటూ బీజేవైఎం నేతలు డీజీపీని సైతం కలిశారు.. అయినప్పటికి ఈ షోకు అనుమతి లభించింది..ఇక రేపే షో జరగనుండటంతో తెలంగాణలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. కర్ణాటక సర్కార్ మునావర్ షోను ఇప్పటికే బ్యాన్ చేసింది..