హైదబారాద్: రాష్ట్ర పోలీసు అనుమతి తీసుకుని,ప్రజాసంగ్రామ యాత్ర చేస్తుంటే ఎలా అపుతారని,, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను ఖండుస్తున్నమని ఎం.పీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుటుంబ సభ్యుల పేర్లు బయటపడటంతో ఆయనకు మతిభ్రమించి,,ఈలాంటి చిల్లర మల్లర దాడులు చేయిస్తున్నరని,,ఈలాంటి విషయాలకి బిజెపి భయపడదు అన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు.
పాదయాత్ర ప్రముఖ్:- ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదని పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.పోలీసుల అనుమతితోనే గత మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నామన్నారు.అప్పుడు లేని అభ్యంతరాలు… ఇప్పుడెందుకు? ఎన్ని అడ్డంకులు ఎదురైనా… ఎన్ని ఆంక్షలు పెట్టినా పాదయాత్ర కొనసాగించి తీరుతామన్నారు.అనుకున్న షెడ్యూల్ ప్రకారం భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగిస్తామని తెలిపారు.ఈనెల 27న హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామన్నారు.