అమరావతి: గుజరాత్ ఎన్నికల్లో చరిత్ర లిఖిస్తు బీజేపీ 7వ సారి అధికారాన్ని కైవసం చేసుకుంది.హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. గత ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన అక్కడ ఓటర్లు ఈ సారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. గుజరాత్ లో మొత్తం సీట్లు 182. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 157 స్థానాల్లో గెలుచుకుని తిరిగులేని అధిక్యం చూపింది. కాంగ్రెస్ 16 స్థానాల్లో,,ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో,, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.ఈ నెల 12వ తేదిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారు.
హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 68. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 35. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 25 స్థానాల్లో గెలుపొంది, ఆమ్ ఆద్మీ పార్టీ-0,,ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.