CRIMENATIONAL

కోయంబత్తూరులో ఈశ్వరన్ దేవాలయం వద్ద పేలుడు-ఐసిస్‌తో సంబంధం వున్నఉగ్రవాద దాడి-అన్నమలై

క్రైం స్టోరీ….

అమరావతి: ప్రతిపక్ష బీజెపీ నేత గత ఆదివారం నాడు ఈశ్వరన్ దేవాలయం వద్ద జరిగిన బాంబు పేలుడు సంఘటనపై విమర్శలు తీవ్రతరం చేయడంతో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్,తప్పని సరి పరిస్థితిలో కోయంబత్తూరు కారు పేలుడు కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు.

కోయంబత్తూరులో కొట్టాయ్ ఈశ్వరన్ దేవాలయం వద్ద ఈ నెల ఆదివారం(23) ఉదయం ఓ మారుతి 800 కారులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో కారులో వున్న జమేజా ముబిన్ (25) ప్రాణాలు కోల్పోయాడు.దీపావళీకి ముందు రోజున భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయంకు వచ్చి పూజలు నిర్వహిస్తారు.సంఘటన వేకువజామున 4 గంటల ప్రాంతంలో జరగడం,,పేలుడు జరిగిన చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఇనుప ముక్కలు,,ఇనుప చీలలు,,బేరింగ్ బాల్స్ లాంటి వస్తువులు కన్పించడంతో,ఇది సాధరణ గ్యాస్ సిలండర్ పేలుడు ఘటన కాదని,,ముమ్మటికి ఉగ్రవాద చర్య అని,,అదే పేలుడు 6 గంటల ప్రాంతంలో జరిగి వున్నట్లయితే,,గుడికి వచ్చే భక్తులకు ఆపారమైన ప్రాణనష్టం సంభవించేదని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు.అప్పటి వరకు గ్యాస్ సిలండర్ పేలుడు ఘటన భావించి పెద్దగా సీరియస్ గా తీసుకొని కొయంబత్తూరు పోలీసులు,ఉన్నతధికారులు అదేశాలతో,,సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. పోలీసులు cctv ఫుటేజ్‌ను పరిశీలించి, ఐదుగురిని మంగళవారం అరెస్టు చేశారు.ముబిన్ ఇంట్లో నుంచి ఓ గ్యాస్ సిలిండర్‌ను గోనె సంచీలో పెట్టి కారు వద్దకు వీరంతా కలిసి తీసుకొచ్చినట్లు గుర్తించారు.కారులోని గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మంటల్లో చిక్కుకుని ముబిన్ మరణించగా, మహమ్మద్ డల్గా, మహమ్మద్ అజారుద్దీన్, మహమ్మద్ రియాస్, ఫిరోజ్ ఇస్మాయిల్, మహమ్మద్ అనస్ ఇస్మాయిల్‌లను అరెస్టు చేశారు. వీరిపై UAPA ప్రకారం కేసు నమోదు చేశారు. కోర్టు వీరికి 15 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి, ముబిన్ ఇంట్లోనూ, అల్-ఉమ్మా సంస్థకు చెందినవారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. అల్-ఉమ్మా చీఫ్ సయ్యద్ అహ్మద్ బాషా సోదరుడు నవాబ్ ఖాన్ ఇంట్లో కూడా సోదాలు చేశారు.1998లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళకు కుట్ర పన్నినవారిలో నవాబ్ ఒకడు. ప్రస్తుతం ఇతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

(నవాబ్ కుమారుడు మహమ్మద్ డల్గాను పోలీసులు విస్తృతంగా ప్రశ్నించారు. తాజా కేసులో అరెస్టయిన వారిలో డల్గా కూడా ఉన్నాడు. మరణానికి ముందు ముబిన్ పోస్ట్ చేసిన వాట్సాప్ స్టేటస్‌లో, ‘‘నా మరణ వార్త మీకు చేరితే, నా పొరపాట్లను క్షమించండి. నా లోపాలను దాచిపెట్టండి. నా జనసలో పాలుపంచుకోండి. నా కోసం ప్రార్థించండి’’ అని ఉందని పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న చేతిరాత పత్రాల్లో వీరు కొన్ని చోట్ల రెక్కీ నిర్వహించినట్లు ఉందని పోలీసులు తెలిపారు. రేస్ కోర్స్, విక్టోరియా హాల్, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయన్నారు.)

తమిళనాడు బీజేపీ అధ్యక్షడు K.అన్నమలై మీడియాతో మాట్లాడుతూ, ఇది సాధారణ గ్యాస్ సిలిండర్ పేలుడు కాదని, ఇది ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధం గల ఉగ్రవాద దాడి అని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. తమిళనాడు బీజేపీ నేత నారాయణన్ తిరుపతి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, అణ్ణామలై ఆరోపణలను పునరుద్ఘాటించారు. ఈ కేసుపై దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి తాము ఇది ఉగ్రవాద దాడి అని చెప్తూనే ఉన్నామని,,అయితే తమిళనాడు పోలీసులు మాత్రం ఇది కేవలం గ్యాస్ సిలిండర్ పేలుడు మాత్రమేనని చెప్పారన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అణ్ణామలై విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఇది ఉగ్రవాద చర్య అని స్పష్టంగా చెప్పారన్నారు. అప్పటి వరకు ఈ నిందితులపై కేసు నమోదు చేయలేదన్నారు. అణ్ణామలై ఆరోపణల తరువాత మాత్రమే కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్ స్పందించి, ఐదుగురు నిందితులను యూఏపీఏ క్రింద అరెస్ట్ చేసినట్లు చెప్పారని తెలిపారు. పోలీసులు చురుగ్గా పని చేయలేదు కాబట్టి ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *