MOVIE

‘బాయ్ కాట్ లైగర్ మూవీ’-ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళే చూస్తారు-విజయ్

హైదరాబాద్: బాలీవుడ్ సిని పరిశ్రమను తల్లక్రిందులు చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్,,ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాను తాకింది..ఇటీవల లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్ సినిమాలు బాయ్ కాట్ ట్రెండ్ తో బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్లు లేక నష్టం వందల కోట్లలో వచ్చింది..ఇందుకు ప్రధాన కారణం,సదరు హోరోలు,నిర్మాతలు దేశం పట్ల,,హిందు దేవుళ్ల,సంప్రదాయల పట్ల నిర్లలక్ష్యంగా వ్యాఖ్యనించడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు..ప్రస్తుతం ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ లైగర్ మూవీ’ అనే హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతోంది.. లైగర్ ను బాయ్ కాట్ చేయాలనే అంశం ప్రచారంలోకి రావడానికి కారణం…..హీరో విజయ్ చేసిన కామెంట్స్,,నిర్మాత కరణ్ జోహర్ అని టాక్ నడుస్తోంది..బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఆగష్టు 25వ తేదిన విడుదల కానున్న సమయంలో బాయ్ కాట్ ట్రెండ్ ప్రారంభంమైంది..ఈ ప్రచారం చేస్తున్న నెటిజన్లు తమ వాదనను సమర్ధించుకుంటున్నారు..‘‘బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన కరణ్ జోహర్ ఒక ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నందున లైగర్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నం’’ అని పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానించారు.. 

అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా బాయ్ కాట్ సెగతో దెబ్బతిన్నది..ఈ విషయంను దృష్టిలో వుంచుకుని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, అమీర్ ఖాన్ కు వ్యతిరేకంగా ట్రోలింగ్ జరగడాన్ని ఖండించారు..లాల్ సింగ్ చద్దా మూవీని బాయ్ కాట్ చేయాలనడం సరికాదన్నారు. ‘‘ఒక సినిమాపై ఎంతోమంది నటులతో పాటు వందలాది సినీకార్మికుల కుటుంబాలు ఆధారపడి ఉంటాయన్నారు..ఈ అంశాన్ని పట్టించుకోకుండా బాయ్ కాట్ అని ప్రకటించడం బాధ్యతారాహిత్యమే అవుతుంది..‘‘ మేము సినిమాలు చేస్తాం. ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళే చూస్తారు..ఎవరు చూడొద్దనుకుంటున్నారో వాళ్ళు టీవీలో,, ఫోన్లో చూస్తారు. అందులో అసలు మేము చేసేదేముంది? వాళ్ల గురించి పెద్దగా మాట్లాడక పోవడం బెటర్’’ అంటూ బాయ్ కాట్ ట్రెండ్ చేస్తున్న వారి గురించి విజయ్ దేవరకొండ ఇటీవల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..విజయ్ ఈ నిర్లలక్ష్యపు వ్యాఖ్యల వల్లే బాయ్ కాట్ ట్రెండ్ మొదలైందని పలువురు అభిప్రాయపడుతున్నారు..రాబోయే రోజుల్లో ఏవిధమైన పరిణామలు చోటు చేసుకుంటాయో ?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *