హైదరాబాద్: నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదని,,ఆదివారం ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు..శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రానివి అన్నీ ఏకపక్ష నిర్ణయాలే అని విమర్శించారు..కేంద్ర తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని చెప్పారు.. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని, ఎలాంటి ప్రణాళికలు లేకుండా ముందుకు పోతోందని అన్నారు..ప్రస్తుతం భారతదేశం సంక్లిష్ట పరిస్థితిలో ఉందని కేసీఆర్ అన్నారు..రూపాయి విలువ పడిపోయిందని, నిరుద్యోగ రేటు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు..మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, దీనికి కేంద్ర విధానాలే కారణం అని విమర్శించారు..ఇలాంటి ముఖ్యమైన అంశాలపై నీతి ఆయోగ్‌లో చర్చించడం లేదని విమర్శించారు..కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపే అంశాలపై చర్చ లేదని, కేంద్రం నిస్తేజంగా చూస్తూ ఉండిపోతోందని మండిపడ్డారు..