బ్రిటన్ కొత్త ప్రధానిని ఎన్నుకొనేందుకు ముమ్మర ప్రయత్నాలు

అమరావతి: కొత్త ప్రధానిని ఎన్నుకొనేందుకు బ్రిటన్ లో, అధికార కన్జర్వేటివ్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తొంది..కొత్త నిబంధనల ప్రకారం కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షపదవికీ,తదనంతరం ప్రధానమంత్రి పదవికీ పొటీ చేసేందుకు అభ్యర్దులకు కనీసం 100 మంది ఎంపిల మద్దతు వుండాలి..బ్రిటన్‌లో కొత్త ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ పేరు మరోసారి ముందు వరుసలలో వుండగా,నేను కూడా పోటీలో వున్ననంటూ విహార యాత్ర రద్దు చేసుకుని హుటహుటీన యూకే తిరిగి వచ్చిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే రిషి సునాక్కు 100 మంది ఎంపీల మద్దతు వుందని అయన మద్దతుదారులు పేర్కొంటూన్నారు. ప్రధానమంత్రి పదవిపై సునాక్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.మరో రెండు రోజుల్లో అక్కడి రాజకీయలు పలు మలుపులు తిరగనున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు.