జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాటికి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 2023 జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాటికి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జల జీవన్ మిషన్, మనబడి నాడు-నేడు, జగనన్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు త్వరగా ఇవ్వాలన్నారు. సెప్టెంబర్ 20 లోపు రూ.5 లక్షల విలువు చేసే వర్స్ అన్నింటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, సెప్టెంబరు 30లోగా పూర్తి చేయాలన్నారు. జనవరి 26 లోగా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి అన్ని గ్రామాల్లో నూరుశాతం లక్ష్యం సాధించాలని సూచించారు. అలాగే మనబడి నాడు నేడు పనులను త్వరగా మొదలు పెట్టి బిల్లులు అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష APC శ్రీమతి ఉషారాణి, RWS S.E రంగ వరప్రసాద్,E.E మేడా శ్రీనివాస్ కుమార్, హౌసింగ్ P.D, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.