x
Close
CRIME NATIONAL

గుజరాత్ లో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి-40 మంది మృతి

గుజరాత్ లో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి-40 మంది మృతి
  • PublishedOctober 30, 2022

అమరావతి: గుజరాత్, మోర్బి జిల్లాలోని మచ్చ నదిపై కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా కుప్పకూలడంతో, దాదాపు 40 మంది మృతిచెందినట్లు సమాచారం అందుతుందని, మృతుల సంఖ్య మరింత పెరిగే ఆవకాశం ఉందని గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియ వెల్లడించారు.ఇక ఈ ప్రమాద ఘటనలో దాదాపు 100 మంది జాడ గల్లంతు అయ్యి వుండవచ్చని భావిస్తున్నారు? 100 మంది సందర్శకులు సరదాగా కేబుల్ బ్రిడ్జిపై తిరుగుతుండగా హఠాత్తుగా కుప్పకూలింది. బ్రిడ్జిపై ఉన్న సందర్శకులు తేరుకునేలోపే చాలామంది నదిలో పడిపోయారు. కేబుల్ బ్రిడ్జికి దగ్గరలో ఉన్న వారు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఈ కేబుల్ బ్రిడ్జికి మరమ్మత్తులు రావడంతో కొన్ని రోజులపాటు మూసి వేశారు. ఇటీవలనే అధికారులు మరమ్మతులు పూర్తి చేసి, సందర్శకులు తిరిగేందుకు ఐదు రోజుల క్రితమే అనుమతిచ్చారు. కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిన ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెంటనే స్పందించి, తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని మోడీ స్వయంగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు చెరో రూ.50వేలు చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. 

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.