లోన్‌యాప్స్ నిర్వాహకుల వేధింపులపై కాల్ సెంటర్ నెం.1930

అమరావతి: ఇటీవలికాలంగా లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోన్‌యాప్ నిర్వాహకుల బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.1930 కాల్ సెంటర్ ఫోన్ చేసి, బాధితులు ఫిర్యాదు చేయవచ్చని హోంశాఖాధికారులు తెలిపారు. కాల్ సెంటర్‌ను సంప్రదిస్తే వెంటనే స్పందిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలోని పౌరులకు హోం శాఖ కీలక సూచనల చేసింది. ఆకర్షించే లోన్ మెసేజ్‌ల లింక్‌లు ఓపెన్ చేయొద్దని సూచించింది. ఫోన్లలోని – కాంటాక్ట్, అడ్రస్, లొకేషన్ల పర్మిషన్లు ఇవ్వొద్దని సూచించింది.అదిరే ఆఫర్స్ అంటూ ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తారని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.విలువైన జీవితాలను ఇలాంటి విషయాల కోసం బలి చేసుకోవద్దని కోరింది.