బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ పై కేసు నమోదు ?

అమరావతి: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఒంటి పై నూలు పోగు లేకుండా నగ్నం ఫొటో షూట్ చేసి,,వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు..ఈ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి..ఈ న్యూడ్ ఫోటోలపై ముంబయిలోని ఓ ఎన్జీవో చెంబూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాధు చేసింది.. దీంతో నటుడు రణ్ వీర్ పై కేసు నమోదైంది. ఈ ఫొటోలు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పలువురు మహిళలు సైతం ఆరోపించారు. దీంతో ఐపీసీ సెక్షన్ ప్రకారం యాక్ట్ 67ఏతో పాటు 292, 293, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు..ఈ టాప్ హీరో ఇలా ఫొటో షూట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. కొందరు రణ్‌వీర్‌కు మద్ధతు నిలిస్తే, మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.